వన్నెల్ బీ లో దోమల బెడదా నివారణ కార్యక్రమం.
- స్పందించి చర్యలు తీసుకున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం.పీ.ఓ వెంకటేశ్వర్లు.


బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామం లో దోమల బెడదా చాలా ఎక్కువ ఉండడం వలన మాజీ సర్పంచ్ కు ఎన్ని సార్లు మోర పెట్టుకున్న పట్టించుకోలేడు. సర్పంచ్ పదవి కాలం ముగియడంతో కొత్తగా వచ్చిన వన్నెల్ బీ స్పెషల్ ఆఫీసర్ ఎం.పీ.ఓ వెంకటేశ్వర్లు కు విషయం స్థానికులు తెలుపడం జరిగింది ఈ విషయం తెలుసుకొని ఆయన వెంటనే స్పందించి సానిటేషన్ తో దోమల నివారణ చేపట్టారు. ఎం.పీ.ఓ వెంకటేశ్వర్ల కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.