Take a fresh look at your lifestyle.

ఏబీవీపీ ఎల్లారెడ్డి నగర కార్యదర్శిగా జాషువా…

0 1,139

ఏబీవీపీ ఎల్లారెడ్డి నగర కార్యదర్శిగా జాషువా

ఎల్లారెడ్డి,  ఆగస్టు 28 ( లోకంతీరు ) : ఏబీవీపీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లారెడ్డి ఏబీవీపీ నగర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ అన్నారు. ఎల్లారెడ్డి నగర కార్యదర్శిగా జాషువా, నగర సంయుక్త కార్యదర్శిగా వెంకట్, నగర హాస్టల్స్ ఇన్చార్జిగా వంశీలను వివిధ బాధ్యతలతో కూడిన నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి జాషువా మాట్లాడుతూ ఏబీవీపీ పెద్దలు తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేకూరే విధంగా విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థి గొంతుకై ప్రశ్నిస్తూ విద్యార్థి సమస్యల పైన పోరాడుతానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.