Take a fresh look at your lifestyle.

వికలాంగులకు మోటార్ సైకిళ్ల ..అంగన్ వాడి టీచర్లకు డ్యూటీ చీరల పంపిణీ..

0 288

వికలాంగులకు మోటార్ సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

అంగన్ వాడి టీచర్లకు డ్యూటీ చీరల పంపిణీ..

 

        

భీంగల్, జనవరి 23 (లోకం తీరు): బాల్కొండ నియోజక వర్గానికి చెందిన ఆరుగురు వికలాంగులకు మోటార్ సైకిళ్లను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం వేల్పూరు లో అందజేశారు. నాలుగు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు, రెండు బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్ లు ఆరుగురికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఇంకా అనేక మంది అర్హులైన వికలాంగులు ఉన్నారని, వారందరికీ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. మంత్రిని కలిసి విన్నవించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంగన్ వాడి టీచర్లకు,హెల్పర్లకు డ్యూటీ చీరలు పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని భీంగల్ ప్రాజెక్ట్ లో 47 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలు తీసుకున్న లబ్దిదారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి బీమా జమున, ఉపేందర్,వైస్ ఎంపిపి సురేష్, జిల్లా ఆర్టిఓ మెంబర్ రాములు,సామ మహిపాల్,ఎమ్మార్వో,ఎంపిడిఓ మరియు ICDS CDPO భీంగల్ సుధారాణి,ACDPO జ్ఞానేశ్వరి,BRB కో ఆర్డినేటర్ విజయలక్ష్మి,బాల్కొండ నియోజకవర్గము డిసేబుల్ వింగ్ కిరణ్ ,అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.