Take a fresh look at your lifestyle.

వ్యక్తిగత కారణాల చేత రాజీనామా..సింగల్ విండోలో మెజార్టీ పాలకవర్గ సభ్యులు

0 1,773

పోతంగల్ సింగల్ విండోలో మెజార్టీ పాలకవర్గ సభ్యుల రాజీనామా.

  • వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి.
  • 9 మంది డైరెక్టర్లు రాజీనామా పత్రాన్ని సొసైటీ సెక్రటరీకి అందజేత.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలోని ఎల్ఎస్ సిఎస్ పోతంగల్ పాలకవర్గ సభ్యులు 2019 లో ఓటింగ్ లేకుండా ఇనాంనెస్ గా బాడీని ఏర్పాటు చేసి పాలనను కొనసాగించారు. బాడీ ఏర్పాటైన సమయంలో చైర్మన్,వైస్ చైర్మన్ విషయమై ఒక డైరెక్టర్ కొన్ని రోజుల తర్వాత రాజీనామా చేశారు. పాలకవర్గంలో ఉన్నటువంటి 13 మంది సభ్యులలో 12 మంది సభ్యులు సొసైటీ పాలనను కొనసాగించారు. తదనంతరం పాలక వర్గ పరిపాలన సమయంలో సొసైటీలో నెలకొన్న అనిచ్చితి కారణంగా 9 మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేసి రాజీనామా పత్రాన్ని సొసైటీ కార్యదర్శికి అందజేశారు.ఈ రాజీనామా చేసిన డైరెక్టర్లో గంధపు పవన్ (పోతంగల్),కేశ లక్ష్మి (పోతంగల్),లింగప్ప(కల్లూరు),వి.చిన్న గంగారం (కొడిచర్ల),ఎన్.రూప్సింగ్ (జల్లాపల్లి),ఎం.శ్రీనివాస్ రావు (హెగ్డోలి),ఎం.భగవాన్ రావు (సుంకిని),కే.చిన్న పోశవ్వ.

 

 

Leave A Reply

Your email address will not be published.