ఇంతకీ నిరుద్యోగుల పరిస్థితి గట్టెక్కేనా..?
- డా.పోలం సైదులు ముదిరాజ్ ( M.A.,B.Ed.,Ph.D. )

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 06 (లోకం తీరు ) : తెలంగాణరాష్ట్రంలో నిరుద్యోగవ్యవస్థ గురించి,వారి పరిస్థితుల గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే వారి గురించి ప్రస్తావించాలంటే “వ్రాస్తే రామాయణం – చెబితే మహాభారతమంతా” ఉంటుందటం లో ఎలాంటి అతిశయోక్తిలేదు.సరిగ్గా చెప్పాలంటే 2009 సంవత్సరం నుండి అలాగే దాని కంటే ముందు డిగ్రీలు,పీజీలు, పిహెచ్డీలు చేసిన,చేస్తున్నవారి పరిస్థితుల గురించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం,అందులో నిరుద్యోగులు,విద్యార్థులపాత్ర గురించి చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.ఉవ్వెత్తున జరిగిన స్వరాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులపాత్ర కీలకమన్నా విషయం అందరికీ తెలిసిందే.
ప్రత్యేక రాష్ట్రసాధనలో భాగంగా జరిగిన నాటికీయ పరిణామాలలో జరిగిన సంఘటనల అనుసారంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. అప్పటి విద్యార్థులేనన్నది ముమ్మాటికి వాస్తవం.ఎట్టకేలకు 2014 జూన్ 2న ప్రత్యేకరాష్ట్రం ఆవిర్భవించాక ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ లోకానికి వారి ఆశలు ఎండమావిగామిగిలిపోయాయి
దశాబ్దకాలపాలనలో మొదటగా “ఇల్లు చక్కపెట్టాలంటే కొంత సమయం వేచి ఉండాలన్నారు” తర్వాత కమిటీలు,కమిషన్లు,సర్వేలు,విశ్లేషణలు,సమీక్షలంటూ మరికొంతకాలాన్ని గడిపారు. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అరకొరా నియామకాలు చేపట్టిన తప్పుడుప్రశ్నాపత్రాలు లీకేజీలు,గుట్టురట్టు,కేసులు,కోర్టులు అంటూ జరిగినతతంగం అందరికీ తెలిసిందే.అంతెందుకు మొన్నటి గ్రూప్స్ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకోసం ఏప్రిల్ 28,2022న నోటిఫికేషన్ జారీచేశారు.ఈ పోస్టులకోసం సుమారు 3.80 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.మొదటిసారి నిర్వహించిన పరీక్షను పేపర్ లీకేజీ కావడంతో రద్దుచేశారు. రెండోసారి పరీక్ష నిర్వహించి,
తుది ‘కీ’ కూడా విడుదల చేశారు.అయితే కొంతమంది అభ్యర్థులు పరీక్షనిర్వహణలో లోపాలు ఉన్నాయని,
అధికారులు పొరపాట్లు చేశారని కోర్టులో కేసువేశారు.ముఖ్యంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలుపరచలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.విచారణ అనంతరం పరీక్షను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.దీనిపై టీఎ్‌సపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.కేసు విచారణకు రావాల్సిఉంది.అలాగే సుమారు 8,039 గ్రూపు-4 పోస్టులకోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించి, తుది కీ కూడా ప్రకటించారు.ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.మహిళా రిజర్వేషన్‌పై కోర్టులో కేసు కొనసాగుతోంది.తుదితీర్పు రాకపోవడంతో వీటి ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. 783 గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం సుమారు 5.51 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.మొదట నిర్ణయించిన ప్రకారం గత ఏడాది ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.పేపర్ లీకేజీ వ్యవహారం బయట పడడంతో వాయిదా వేశారు.తిరిగి నవంబరు 2,3 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.అయితే అభ్యర్థుల ఆందోళనతో వాయిదా వేశారు. తర్వాత గ్రూపు-2 పోస్టులకు పరీక్షను షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది.
అప్పటికి కొత్త కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో వాయిదా వేశారు.తాజాగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.అలాగే గ్రూపు-3 పోస్టుల పరీక్షతేదీలు కూడా ప్రకటించాల్సి ఉంది.సుమారు 1,363 గ్రూపు-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేస్తే 5.8 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఇంకా హాస్టల్ వార్డెన్,డీఎస్సీ వంటి ఉద్యోగాలకు సైతం మరికొంతమంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు.ఇవియేగాకుండా ఇతర పోస్టుల విషయంలోనూ టీఎ్‌సపీఎస్సీ అధికారులు తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇందులో ప్రధానంగా లైబ్రేరియన్లు (71),డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు (18),ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లు (1392),అసిస్టెంట్ ఇంజనీర్లు (833),వెటర్నరీ సర్జన్లు (185),టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (175),ఉద్యాన అధికారులు (22),అకౌంట్స్ ఆఫీసర్లు,పాలిటెక్నిక్ లెక్చరర్లు,ఏఎంవీఐ,వ్యవసాయ అధికారులు,గురుకుల అధ్యాపకుల వంటి పోస్టులకు పరీక్షలు పూర్తిచేశారు.వీటి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.విశ్వవిద్యాలయ నియామకాల గురించి ఊసే లేకపోవడమనేది జగమెరిగిన నగ్నసత్యం.అంటే ఉద్యమకాలంతో కలిపి ఒకటిన్నర,రెండుదశాబ్దాల కాలంనుండి ఎలాంటి నియామకాలు జరగకపోవడం వలన అప్పటినుండి అర్హతసాధించి కొలువులకై వేచిచూసే నిరుద్యోగుల పరిస్థితి ఊహించడానికి కష్టమన్నది వాస్తవం.ఈ పది,పదిహేను సంవత్సరాల
కాలంలో సైతం సిబ్బంది లేకున్నా డిగ్రీల పట్టాలను పొందిన మరెందరో నిరుద్యోగయువతఉద్యోగాలకు సన్నద్దమవుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా, ఉద్యోగరంగాలలో అత్యంత అణిచివేతకు గురైందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది నిరుద్యోగులు..!
ఉన్నత చదువులు చదివినవారు సైతం ఆర్థిక సమస్యలు,తల్లిదండ్రులకు భారంకాలేక 40ఏళ్ళు దాటిన పెళ్లిళ్లుగాక విభిన్న కారణాలతో మానసిక ఆందోళనలకు గురై సూసైడ్ నోట్స్ వ్రాసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అందరికీ తెలిసినవే.ఏదైతేనేమీ మొన్నటి సాధారణ ఎన్నికలలో ప్రతిపక్ష,పార్టీలు,ప్రజాపక్షాలు,విద్యావంతులు,విద్యావ్యవస్థ ఎంత నిర్వీర్యమైందో తెలియజేసిప్రభుత్వంమార్పుకు పనిచేశారు.అందులో విద్యార్థులు,నిరుద్యోగలోకం గట్టి మద్దతునిచ్చి ఎట్టకేలకు ప్రభుత్వాన్నిమార్చి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు.పలు వేదికలలో విద్యావ్యవస్థ గురించి ఘాటుగానే స్పందించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత విద్యాశాఖమంత్రి పదవిని ఎవరికి కేటాయించ కుండా తనవద్దనే పెట్టుకొని ప్రత్యేకదృష్టి కేంద్రీకరించి సమీక్షలు నిర్వహిస్తూ పలు కీలకనిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులోభాగంగానే గత ప్రభుత్వం నియమించిన టిఎస్పిఎస్సిలో భారీగా అవకతవకులు జరిగినట్లు ఆరోపణలు
రావడంతో వారిని తొలగించి నూతనంగా సభ్యులను నియమించి మాజీ డిజీపీ మహేందర్రెడ్డి చేతిలో పెట్టారు.అలాగే గతప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ కు అదనంగా మరిన్ని పోస్టులుకలిపి మెగా డీఎస్సీ ప్రకటిస్తామని,గతంలో దరఖాస్తుచేసుకున్న అభ్యర్థులు మరలా చేసుకోవాల్సిన అవసరంలేదని ప్రకటించడం గమనార్హం.ఈ మధ్య ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 7094 స్టాప్ నర్సుల నియామకపత్రాల అందజేసే కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంకా అదనంగా 15000 పోలీస్ కానిస్టేబుల్ సిబ్బందికి సంబంధించిన నోటిఫికేషన్ వేస్తామని, ఏడాదిలోపు ఎన్నికలముందు హామీనిచ్చినట్లు రెండులక్షల కొలువులు భర్తీచేస్తామని చెప్పడం నిరుద్యోగులలో కొంత మనోధైర్యాన్ని కలిగించిందని చెప్పవచ్చు.
అంతా బాగానే ఉన్నది.కానీ..?
అసలైన సమస్య ఇక్కడే పొంచిఉన్నది.గతంలో ఏఒక్క ఉద్యోగ నియామక పరీక్ష సజావుగా జరగకుండా కోర్టు మెట్లు ఎక్కి తీర్పుకు ఎదురుచూడడం జరిగింది.అలాగే గత ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉమ్మడి 10జిల్లాలను 33 జిల్లాలు గాచేసి రాష్ట్రంలోని ఉద్యోగుల స్థానచలనాలకు గురిచేసింది. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనవారు వివిధ దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో కోర్టుమెట్లెక్కగానే అధికాస్త పెండింగ్ లో పడింది.అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఊసే లేకుండా పోయింది.విశ్వవిద్యాలయంలోని బోధనసిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదన
ప్రక్రియలో కొంత గందరగోళం ఉన్నది. వీటన్నింటిని సరిచేస్తూ విద్యా,ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళనగావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రస్తుత సమాజంలో ఏదైనా చేతికొచ్చినప్పుడే..!
జరిగిందనుకోవాలి.ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల మాటలను అసలు నమ్మేప్రసక్తే ఉండదు.“కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్లు” జరగకపోవడానికి సైతం సవాలక్ష కారణాలను చూపడం జరుగుతుంది.గత ప్రభుత్వంలో ఎన్నికలు (సాధారణ,మద్యంతర,లోకసభ,రాజ్యసభ,శాసనమండలి,స్థానిక సంస్థలు ఎన్నికలు) వచ్చినప్పుడల్లా ప్రచారంలో
భాగంగా ఎన్నో హామీలను ఇచ్చినప్పటికీ ఎన్నికలు ముగిసినతర్వాత కార్యరూపం దాల్చలేదు.ఇక్కడ పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొంటుంది.ఎన్నికల మధ్య కొంత సమయం ఉన్నట్లుగా ఒక ఎన్నిక మగిశాక ఉద్యోగఖాళీలనుగుర్తించడానికి కమిటీలను నియమించడం ,మరొక ఎన్నికను ముందు నోటిఫికేషన్ వేయడం,
ఎన్నికతర్వాత ఏదోఒక కారణంచేత కోర్టు పరిధిలోకి వెళ్లడం,మరో ఏదైనా ఎన్నిక వస్తే ఆ కోర్టు సమస్యపరి
ష్కారమై పరీక్షలు నిర్వహించడం,దానితర్వాత ప్రశ్నపత్రాలలో తప్పులు, లీకేజీలు కారణాలతో మరల కోర్టుకెళ్లడం ఒక్కొక్కసారి ఎన్నికలకోడ్ అడ్డుపడటం చివరికి గతప్రభుత్వం కొన్ని ఉద్యోగాన్నియామక పోటీపరీక్షలు నిర్వహించిన
ప్పటికి ఫలితాల విడుదలకు అలాగే మరికొన్ని పరీక్షలకు నోటిఫికేషన్ వేసి పరీక్షతేదీలు ఖరారుచేసినప్పటికీ మొన్నటి సాధారణఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు కోడ్ వచ్చి ఆగిపోవడం అందరికీ సుపరిచితమే.
ఈ ప్రభుత్వంలో సైతం ప్రస్తుతం లోకసభ ఎన్నికలు..!
జరగనున్నాయి.దానికోసం పలుపార్టీలు అంతర్గతంగా ప్రచారాలను మొదలు పెట్టారు.దానితర్వాత శాసనమండలి, స్థానికసంస్థల ఎన్నికల పర్వం రాబోతుంది.ఈ ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ఆశలపై నీరుజల్లకుండా, గతప్రభుత్వపు తప్పిదాలను పునరావృతం చేయకుండా, ఇచ్చిన హామీప్రకారం మాటనిలుపుకొని ప్రజాపాల
నకు ఖచ్చితమైన నిర్వచనం చూపుతూ,కార్యరూపం దాల్చి నిరుద్యోగ నిర్మూలనకు పాటుపడుతూ రాష్ట్రాభివృద్ధి
వైపు అడుగులు వేసి ప్రజామన్ననలు పొందాలని ఆశిద్దాం.