బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ చిన్నారి మృతి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : ట్రాక్టర్ బైకు ఢీకొన్న సంఘటన సోమవారం రోజు రాత్రి 7 గంటల సమయంలో లింబూర్ వాడి గ్రామానికి చెందిన రాజు, చందు వారి యొక్క తమ్ముడు నాగనత్ కూతురు సాన్విక (6) బైక్ పై మద్నూర్ నుండి వారి గ్రామానికి వెళ్తుండగా తాడిహిప్పర్గ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడం తో సన్విక అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులు రాజు, చందు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని మద్నూర్ పోలీస్ లు తెలిపారు.