Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ.

0 1,713

కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ.

  • పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్.ఎల్.సి) ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పరిశీలించారు.
బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈ.సీ.ఐ.ఎల్ ఇంజినీర్లు నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా ఎఫ్.ఎల్.సీ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.