అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటి జోలికి రావద్దు..! ![]()
కామారెడ్డి జిల్లా, జూలై 26 ( లోకంతీరు ) : సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం మల్లిస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం సమంజసం కాదని సదాశివ నగర్, రామారెడ్డి మండల బారాస నాయకులు అన్నారు. శుక్రవారం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్న ఏడు గ్రామాల రైతులు నాయకులు సమావేశం ఏర్పాటు చేసి కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.సుమారు తొమ్మిది గ్రామాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు నీటిని తాగునీటికి తరలిస్తామని చెప్పడం జరిగిందని ఇది సరైననిర్ణయం కాదన్నారు.ఈ చెరువు కింద చిన్న సన్నకారు రైతులకు సుమారు 900 ఎకరాలు రెండు పంటలు పండిస్తారని అలాంటిది రైతుల పొట్టగొట్టి 30% నీటిని కామారెడ్డి పట్టణానికి తాగునీటికి తీసుకుంటామని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వం గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టగొట్టి తాగునీటి కోసం నీటిని మళ్ళిస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తొమ్మిది గ్రామాల రైతుల ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణానికి అవసరమైతే రెండో పైపులైన్ విసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గాని కామారెడ్డి పెద్ద చెరువు లోతుగా చేసి నీళ్లు నిలువ చేసుకోవాలని వారు సూచించారు.ఈ సమావేశంలో సదాశివ నగర్ రామారెడ్డి మండలాల బిఆర్ఎస్ అధ్యక్షులు బొల్లిపెల్లి మహేందర్ రెడ్డి, రంగు రవీందర్ గౌడ్, సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు , రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి వీడీసీ చైర్మన్ ఎడ్ల నర్సింలు, కురుమ సహకారసంఘం అధ్యక్షులు బీరయ్య, రామారెడ్డి మండల బీయారెస్ సీనియర్ నాయకుడు పోతుల లింగారెడ్డి, ఆశరాజు కళాలి సాయ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంకరి రవి, ఇస్రోజివాడి మాజీ సర్పంచ్ కొత్త రాజు, రవీందర్ రెడ్డి కన్నాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
