Take a fresh look at your lifestyle.

బాంసెఫ్ 11 వ రాష్ట్ర మహాసభ లను విజయవంతం చేయండి….

0 1,110

బాంసెఫ్ 11 వ రాష్ట్ర మహాసభ లను విజయవంతం చేయండి

కామారెడ్డి జిల్లా , ఆగష్టు 27 ( లోకంతీరు ) : బి వి ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తో బాంసెఫ్ రాష్ట్ర మహాసభల కరపత్రలను మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్బంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతు సెప్టెంబర్ 1 తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బాంసెఫ్ రాష్ట్ర మహాసభ విజయవంతం చేయాలనీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తో కరపత్రాలను విడుదల చేసారు. ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయాలనీ కొన్ని సంవత్సరాలుగా బాంసెఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నమన్నారు. ఈవీఎం హ్యాకింగ్ చేసే అవకాశలు చేలానే ఉన్నాయని నిరూపించారు. అందుకే ఈవీఎంలను రద్దు చేయాలని, ఓబీసీల కులాదారిత జన గణన వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం ఆపాలని జాతీయ విద్యా విధానం 2020 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు.కావున ఈ మహాసభలను విజయవంతం చేయాలనీ కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో కళాశాల బివియం బాద్యులు శివ కుమార్, శ్రవణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.