రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 ( లోకంతీరు ) : రుణమాఫీ రాని రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివ నగర్ రైతు వేదికలో మంగళవారం రుణమాఫీ రాని రైతుల వివరాలను సేకరిస్తున్న వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ అందేవిదంగా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ కు ఆదేశించారు. రేషన్ కార్డు లేని రైతుల వివరాలు యాప్ వచ్చిన తరువాత నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో క్షున్నంగా పరిశీలించాలని సూచించారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏ ఈ ఓ కవిత, అధికారులు పాల్గొన్నారు.