వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన …
సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…. ఎల్ డిఎం యు.నాగ శ్రీనివాసరావ్..

నిజామాబాద్, ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఐ అండ్ బి, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మ నాయక్ అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలూరు, ఖానాపూర్ లో వికసిత్ భారత్ యాత్ర పేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐ అండ్ బి, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియని వారికి, వాటిని వినియోగించుకోకుండా ఇంకా మిగిలిపోయిన వారికి పథకాలు అందించడానికి పెద్ద ఎత్తున వికసిత్ భారత సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పీఎం జీవన్ బీమా పథకం, రీ సర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ, ఐటీ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, పిఎంజెఏవై, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్, ఉజ్వల, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆవాస్ యోజన, విశ్వకర్మ, పిఎం పోషణ్ అభియాన్, హర్ ఘర్ జల్ – జల్ జీవన్ మిషన్, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. వికసిత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆధార్ ఎన్రోల్మెంట్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని, వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అలాగే ఎల్ డిఎం యు.నాగ శ్రీనివాసరావ్ మాట్లాడుతూ….అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ మాలిక్, డాక్టర్, అగ్రికల్చర్, మెప్మా, ఇతర శాఖల అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.