Take a fresh look at your lifestyle.

భీంగల్ కు బదిలీపై వచ్చిన నూతన ఎంపీడీఓకు ఘన స్వాగతం….

0 1,486

భీంగల్ కు బదిలీపై వచ్చిన నూతన ఎంపీడీఓ కు ఘన స్వాగతం

  • పూల మాలలతో సన్మానించిన ఐకేపీ సిబ్బంది

భీంగల్ , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓ లను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా భీంగల్ ఎంపీడీఓ గా సంతోష్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. బుధవారం నాడు నూతన ఎంపీడీఓ సంతోష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.నూతన ఎంపీడీఓ కు ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్,సిబ్బంది ఘన స్వాగతం పలికి శాలువా,పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల్లో సంక్షేమ పథకాలో ప్రజలకు చేరవేయడంలో సహకరించాలని, మండలాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచడానికి మనమందరం కలిసికట్టుగా పని చేయాలని చెప్పడం జరిగింది.దీనికి ఏపీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎల్లవేళలా సహకరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ సీనియర్ సిసి పురస్తు నరేష్,గడాల రఘుపతి,గంగాధర్,సాయిలు,భాస్కర్, గణేష్,ముత్యం ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.