రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి

కామారెడ్డి జిల్లా బిబిపేట, మార్చి 14 ( లోకంతీరు ) : జిల్లాలోని బీబీపేట మండలం రామారెడ్డిపల్లె రోడ్డు గత 10 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బీబీపేట ఎంపిటిసి కొరివి నీరజ నర్సింలు పత్రిక ప్రకటనలో తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు పనులు పూర్తిగా అద్వాన్నంగా మారాయన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్యలు జరిపి రోడ్డు మరమ్మత్తు పనులు జరిపించాలని కోరారు. బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తే ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా సులువుగా ఉంటుందని వారు వాపోయారు. ప్రజలు ఆర్టీసీ బస్సులు నడిపే విదంగా ఉంటుందని, నాలుగు కిలోమీటర్ల రోడ్డును రామరెడ్డి పల్లె నుంచి యాడవరం రోడ్డుకు కల్పించాలని కోరారు. టిఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీ కొరివి నీరజ ఎన్నోసారి మొరపెట్టుకొని విన్న వించిన పట్టించుకోలేదని వాపోయారు.