Take a fresh look at your lifestyle.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ….

0 1,824

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ….

  • జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్

నిజామాబాద్, ఫిబ్రవరి 06 ( లోకంతీరు న్యూస్ ) :  జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ , ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం రోజు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలియజేశారు. ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా ప్రతిరోజు ఈ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. మొత్తం మూడు స్పెల్ లలో ఈ పరీక్షలు జరుగుతాయని మొదటి స్పెల్ ముగిశాయి అని తెలిపారు. మంగళవారం ఉదయం జనరల్ మొత్తం 1,302మంది విద్యార్థులకు గాను 1,255 మంది హాజరుకాగా 47 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు తెలిపారు. ఒకేషనల్ 592 మందికి గాను 537 మంది విద్యార్థులు హాజరు కాగా 55 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని తెలియజేశారు.అలాగే మధ్యాహ్నం జనరల్ విద్యార్థులు 899మంది కి గాను 868 మంది హాజరుకాగా 31మంది గైర్హాజరయ్యారని తెలియజేశారు. అలాగే ఒకేషనల్ లో మొత్తం 442 మంది విద్యార్థులకు గాను 407 మంది విద్యార్థులు హాజరు కాగా 35 మంది విద్యార్థులు గైర్ హాజరు అయ్యారని తెలియజేశారు. జిల్లాలో మొత్తం ఇంటర్ విద్యాధికారి ఆరు పరీక్ష కేంద్రాలను, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రాజీయూదిన్ అస్లాం, దేవారం, హై పవర్ డాక్టర్ చిరంజీవి, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు 26 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను సమీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.