సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలి.
-
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ,రామారావు మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రతి ఒక్కరూ చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం లంబాడాల అభివృద్ధి అన్ని విధాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.ప్రతి యేటా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా లంబాడాలు వరకట్నం తీసుకుంటున్నారని అన్నారు.ఈ వరకట్నంను బ్యాన్ చేయాలని అన్నారు.లంబాడాలు ఎదురుకుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చెపడతామన్నారు.అనంతరం సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.