మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ
కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో రియాజ్ 20 సం.లు అనే యువకుడు మృతి చెందారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, చికిత్స నిమిత్తం హైదరాబాదు తీసుకువెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్ర శేఖర్ రెడ్డి మృతుని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసి, గురువారం కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. విశ్వజరాల దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి ఏమైనా అవసరం ఉంటే తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తమకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.