Take a fresh look at your lifestyle.

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి…..

0 131

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి.

  • ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : ప్రతి టీకాల కార్య క్రమంలో భాగంగా ప్రతి ఆశా,ఆరోగ్య కార్యకర్తలు పిల్లలు,గర్భిణీల వివరాలు ప్రకారం డ్యూ లిస్ట్ తో పాటు వారికి టీకాలు వేసి వాటి వివరాలను యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలని ఉమ్మడి కోటగిరి మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ తెలిపారు.బుధవారం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేస్తూ.గర్భిణీ,చిన్న పిల్లకు అందచేసే టీకాలు అందుబాటులో ఉంచుకోవాల న్నారు.ఈ ఉపకేంద్రం నందు అన్ని రకాల చిన్న చిన్న రుగ్మాతలకు తగిన మందులు అందుబాటులో ఉంచుకోవాల న్నారు.అసంక్రామిత వ్యాధుల నిర్దారణ పరీక్షలు నిరంతరం అన్ని గ్రామాలలో చేయాలని తెలియజేశారు.ప్రతి గురువారం రక్త పోటు,మధుమేహంతో ఉన్న వారికి వయోవృద్దులకు పరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్త సరోజ, ఆశాలు స్రవంతి,కమల, అరుణ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.