Take a fresh look at your lifestyle.

తె. యు. మెస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి….

0 1,792

తె. యు. మెస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి.

  • PDSU డిమాండ్

నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) :   తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల విషయంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు మెస్ బకాయిల్లో అవినీతి జరిగిందని అధికారులకు తెలిపినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పేద విద్యార్థులపై భారాన్ని మోపే విధంగా యూనివర్సిటీ అధికారులు మెస్ డిపాజిట్లను పెంచడం దారుణమన్నారు. దీనికి తోడు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా అధిక చార్జీలను వేయడం దారుణం అన్నారు. నాసిరకం భోజనానికి వేలల్లో బిల్లులు రావడం వెనుక కారణాలని తేల్చాలన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PDSU జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషుర్, అనిల్ లు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్పులు పెండింగ్లో ఉండి, విద్యార్థులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయన్నారు. అదే సందర్భంలో విద్యార్థులను మరింత అయోమయంలో నెట్టే విధంగా, చదవలేని పరిస్థితిని తెచ్చే విధంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల మెస్ లలో అవినీతికి పాల్పడడం దారుణమన్నారు. విద్యార్థుల మీద మెస్ డిపాజిట్ భారాన్ని మోపే విధంగా రిజిష్ట్రార్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాల మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కోశాధికారి అనిల్, PDSU నాయకులు విష్ణువర్ధన్,రాకేష్, రాము, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.