విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీసీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చ్ 11 ( లోకంతీరు ) : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ఇక్కట్లు తప్పడం లేదు. కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నంబర్ ఏపీ 29 జెడ్ 2616 గల బస్సు రామాయంపేట నుండి కామారెడ్డి వస్తున్నది. బిక్నూర్ టోల్ గేట్ దగ్గర విద్యార్థులు పరీక్ష రాసేందుకు నిరీక్షించగా, కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టోల్గేట్ దగ్గర ఆపక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కారుపై బీటీఎస్ వరకు వెళ్లి బస్సును అడ్డగించగా బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని, అందుకే అపలేమని తల్లిదండ్రులకు సమాధానం చెప్పారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కామారెడ్డి డిపో మేనేజర్ కు ఫోన్ ద్వారా తెలిపారు.కండక్టర్, డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సమాధానం తెలిపారు.