ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి
– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా / రామారెడ్డి, జూలై 22 ( లోకంతీరు ) : రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరేడ్డి మహేందర్ రేడ్డి అన్నారు. సోమవారం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. దీనిని ఓరువలేక ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇట్టి విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.