మొగిలి చెరువు కట్టను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,
– ముత్యాల సునీల్ కుమార్.

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) : భీంగల్ మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప నగర్ మొగిలి చెరువును బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కాలని వాసులతో మాట్లాడారు చెరువు కట్టను పెంచి పటిష్టపరుస్తామని అన్నారు.ఇదివరకె కబ్జాకు గురైనా ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు తీసారని త్వరలోనే సరిహద్దులు తీస్తామని సూచించారు. అన్ని చర్యలు తీసుకొని మొగిలి చెరువును పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.