వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము
— రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుంది
— రెండు చోట్ల ప్రారంభించడం జరిగింది
— అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది
— సోమవారం నుండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుంది
— కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రెడ్డి

కామారెడ్డి , నవంబర్ 02 ( లోకంతీరు ) : లారీలు, కూలీ సమస్యల విషయమై ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది
రైతులు, అధికారులు సమన్వయం చేసుకొని ముందుకి పోవాలి ప్రతి వారం వడ్ల కొనుగోలు విషయంలో సమీక్షా సమావేశం ఉంటుంది ఆనీ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి నియోజక వర్గ పర్యటనలో భాగంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడము జరిగింది. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుందనీ కొన్ని కారణాల వల్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అయ్యిందనీ కానీ నిన్న రెండు చోట్ల ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగిందనీ అన్నారు. సోమవారం నుండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందనీ అన్నారు. లారీలు, కూలీ సమస్యల విషయమై ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందనీ అన్నారు. రైతులు, అధికారులు సమన్వయం చేసుకొని ముందుకి పోవాలనీ అన్నారు. ప్రతి వారం వడ్ల కొనుగోలు విషయంలో సమీక్షా సమావేశం ఉంటుందనీ రైతులకు అండగా తాను ఉంటానని మాట ఇచ్చారు