జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం.
సమ్మయ్య అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 13:భూపాలపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు, నవతెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఎర్రం సమ్మయ్య వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. శుక్రవారం అస్వస్థతకు గురైన సమ్మయ్యను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు హాజరై సమ్మయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నవతెలంగాణ బృందం నివాళి:
ఎర్రం సతీష్ కుమార్ కుటుంబాన్ని నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ మేనేజర్ దేవేందర్‌రావు పరామర్శించారు. ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల అడ్వర్టైజింగ్ ప్రతినిధులు బాబు, ప్రశాంత్, గౌస్ పాషా, ప్రభాకర్, అలాగే నవతెలంగాణ విలేకరులు దూలం కుమారస్వామి, రహీం పాషా, రాజేందర్ తదితరులు పాల్గొని సమ్మయ్యకు నివాళులర్పించారు.
టిడబ్ల్యూజేఎఫ్ నాయకుల పరామర్శ:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి. దయాసాగర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతల కుమార్ యాదవ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీవీ రాజు, ములుగు జిల్లా అధ్యక్షుడు పిట్టల మధుసూదన్, భూపాలపల్లి జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, రాంబాబు, ప్రవీణ్, భాస్కర్, జోవర్ధన్, హనుమకొండ జిల్లా నాయకులు అనిల్ రెడ్డి, వెంకట్, సీనియర్ జర్నలిస్టు చెరుకు సుధాకర్ తదితరులు సతీష్ కుమార్‌ను పరామర్శించి సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) నాయకుల నివాళి:
పెద్దాపూర్‌లో జరిగిన అంత్యక్రియలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, జిల్లా నాయకుడు గుర్రం దేవేందర్ హాజరై సమ్మయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీయూడబ్ల్యూజే హెచ్-143 నాయకుల పరామర్శ:
టీయూడబ్ల్యూజే హెచ్-143 నాయకులు మంతెన సమ్మయ్య, కక్కెర్ల జగన్, పృథ్వి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని సతీష్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
టీఎస్జేయూ నాయకుల సంతాపం:
టీఎస్జేయూ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, నాయకులు గట్టు రవీందర్, కడపాక రవి, మారపల్లి చంద్రమౌళి సతీష్ కుమార్‌ను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ధర్మ సమాజ్ పార్టీ నాయకుల పరామర్శ:
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్, జిల్లా నాయకుడు రాదండి దేవేందర్ సతీష్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి, సమ్మయ్య మృతికి సంతాపం తెలియజేశారు.
- ఎర్రం సమ్మయ్య మృతిపట్ల వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు.