Take a fresh look at your lifestyle.

స్వచ్ఛదనం పచ్చదనం  కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్….

0 1,229

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం లో  జుక్కల్ ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా,ఆగస్ట్ 05 (లోకంతీరు) : జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు కాలినడకన విద్యార్థులలో కలిసి ర్యాలీ నిర్వహించారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరిస్తూ స్వచ్ఛతను పచ్చదనం అనేది అందరి సామాజిక బాధ్యత అని అన్నారు. పరిసరాల అపరిశుభ్రత వలన వ్యాధులు వ్యాపిస్తాయని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాట పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తను సేకరించడానికి మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని ప్రతిరోజు చెత్తను సేకరించి తడి పొడి చెత్తగా సిగరెట్ చేసి సిగ్రిగేషన్ షెడ్ లో చెత్తతో కంపోస్ట్ ఎరువులు తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందని తద్వారా వ్యవసాయ భూములు సారవంతమవుతాయన్నారు. నీరు నిలువ ఉంటే దోమలు పెరిగి మలేరియా డెంగ్యూ వ్యాధిని వ్యాపింప చేస్తాయని నీరు నిలో ఉంచకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి నిలువ నీటిని పారవేయాలని అన్నారు. మిషన్ భగీరథ త్రాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, కాశీ తల్లార్చిన నీటిని ప్రజలు తాగాలని సూచించారు. అలాగే చెట్లు వాతావరణం లో ఆక్సిజన్ సృష్టిస్తాయని వన మహోత్సవం కార్యక్రమం ద్వారా అన్ని ఖాళీ స్థలాలలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు నాటడంతో పాటు ప్రతి విద్యార్థి పుట్టినరోజు లేదా ఇతర పండుగ రోజులలో మొక్కలు నాటి వాటిని పెద్ద చేసే బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా పిల్లలకు ఎస్సే రాయిటింగ్ నిర్వహించారు. ఇందులో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు.

గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పెంపుడు కుక్కలకు ఆంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాలు వేసారు. ప్రతి ఒక్కరు తమ తమ పెంపుడు కుక్కలకు ఏ ఆర్ వి టీకాలు వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 17 పెంపుడు కుక్కలకు ఆంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాలు వేయడం జరిగిందని డాక్టర్ పండరి తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతం తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులు మందు నిల్వ గది పరిశీలించారు.

ఈ కార్యక్రమాలలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, డిఎల్పిఓ నాగరాజు, పిఆర్ డిప్యూటీ మధుబాబు, ప్లాంటేషన్ మేనేజర్ రామ్ నారాయణ, తహసిల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, ఏపీవో తులసి రామ్, ఏపీఎం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.