Take a fresh look at your lifestyle.

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘననివాళులు అర్పించిన…..

0 1,260

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘననివాళులు అర్పించిన -అర్బన్ ఎమ్మెల్యే 

నిజామాబాద్, ఆగస్టు 06 ( లోకంతీరు ) : ఇందూర్ నగరం :ప్రొపెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్బంగా కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతు తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ గారు విద్యావంతుడు మేధావి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆయన పనిచేయడం జరిగిందని
ప్రతేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసి ఎన్నో ఉద్యమలు చేయడం జరిగిందని, యూనివర్సిటీ వేదికగా తన రాసిన పుస్తకాల ద్వారా, మాటల ధ్వరా విద్యార్థులను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని,తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కుతాయి పరాయి వాని పాలనలో మనం బానిసలాగా బతుకుడెంది అని విద్యార్థులను చైతన్యం చేస్తూ రాబోయే   ప్రతేక తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఒకే కోరిక వారికీ ఉండేదని కానీ వారు తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందే మరణించడం దురదుష్టకరం అని,ప్రొపెసర్ జయశంకర్ గారు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన జయంతి సందర్బంగా వారికీ  ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.