సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ గా
వెంచిర్యాల్ గ్రామ వాస్తవ్యులు పాసాపు చిన్న రెడ్డి నిర్మల్ జిల్లా అధ్యక్షులు గా నియామకం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 04 ( లోకంతీరు ) : సోమవారం రోజు హైదరాబాద్ లో ‘సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామ వాస్తవ్యులైన పాసాపు చిన్నారెడ్డి ‘సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రంను అందుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన నియామకం పట్ల గ్రామస్తులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హనుమ గౌడ్, నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్, స్టేట్ చైర్మన్ నర్సింగ్ రావు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ డాక్టర్ శామంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ చైర్మన్ నరేష్ గౌడ్, ఎస్జెడబ్ల్యూహెచ్ ఆర్సి సభ్యులు పాల్గొన్నారు.