మానవత్వం చాటుకున్న కురుమ సాయిబాబా
– ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకురాని స్థితిలో ఆకుటుంబం
– సొంత ఖర్చుతో అంబులెన్స్ మాట్లాడి మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఎల్లారెడ్డి, అక్టోబర్ 14 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల గ్రామానికి చెందిన ఓట్లం గంగారాం అనే రైతు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం ఓట్లం గంగారం మృతి చెందాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి మరింత భారం కావడంతో కనీసం మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకోరాలేని పరిస్థితి భారంగా మారడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తమ సొంత ఖర్చుతో అంబులెన్సు మాట్లాడి ఓట్లం గంగారం మృతదేహాన్ని సోమవారం తమ స్వగ్రామమైన వెల్లుట్లకు తీసుకురావడం జరిగిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. తమ తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా తమకు సహకరించిన కురుమ సాయిబాబాకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు రుణపడి ఉంటామని అన్నారు.
