డాక్టరేట్ సాధించిన తంగలపల్లి స్వాతికి ఘన సన్మానం

కామారెడ్డి జిల్లా /బీబీపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని బిబిపేట మండల కేంద్రానికి చెందిన తంగలపల్లి స్వాతి డాక్టరేట్ పట్టా పొందినందుకు తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సంతోష్ గౌడ్ బృందం ఘనంగా సన్మానించారు .అనంతరం డా. సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పి.జీ లో కెమిస్ట్రీ లో ఇన్స్పైరింగ్ ఫెల్లోషిప్ సాధించారన్నారు.అనంతరం కెమిస్ట్రీ విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ నీళ్ళ చంద్ర కిరణ్ పర్యవేక్షణలో డి ఎం ఎ పి ( 4 డైమితైల్ అమైనో పిరిడిన్) యొక్క తాత్కాలిక జాతులు వివిధ కార్బన్క్ చర్యలలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి తయారీ, నిర్మాణ దిగ్విజయం వాటి రసాయన చర్యశీలతను పరిశ్రమలో తక్కువ ఖర్చుతో వాటి యొక్క వినియోగం) అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి గ్రంతంను సమర్పించారు. హైదరాబాద్ ఐఐసీటి కి చెందిన సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. శ్రీధర్ రెడ్డి ఎక్సామినర్ గా వ్యవహరించి డాక్టరేట్ పట్టాను అందించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ అందుకున్న తంగలపల్లి స్వాతిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పొసు శివ కుమార్, కాశరామ గౌడ్, వెంకటేష్, నిఖిల్, ఆది నందు, చందు, సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.