ఇంకెన్నాళ్లు ఆరు గ్యారంటీల అమలు ?

కమ్మర్పల్లి, ఆగస్టు 20(లోకంతీరు) : ఎన్నికల సమయంలో రైతులకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా అటు ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని కమ్మర్ పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ అధర్యం లో,రాష్ట్ర నాయకులు బద్ద చిన్నా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తూ, ఆగస్టు15వ తేదీ లోపల రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను అవమనపరుస్తూ రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులకు రుణమాఫీ చేయకుండా కొద్దిమంది రైతులకు రుణమాఫీ చేసి, మరికొంతమంది రైతులకు రుణమాఫీ చేయకుండా మొత్తం రైతాంగానికి రూ.2లక్షల రూపాయలను రుణమాఫీ అమలు చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. రానున్న మూడు,నాలుగు రోజుల్లో రైతులకు రుణమాఫీ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ యస్ పార్టీ నాయకులు& రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు…