Take a fresh look at your lifestyle.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొండ్లెపు అర్జున్ నియామకం.

0 22

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జగిత్యాల, మే 27:

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచిని నియమిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతం నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కొండ్లెపు అర్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎస్సీ ఉపకులాలకు గుర్తింపు ఇస్తూ తనను రాష్ట్ర సెక్రటరీగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేసిన ఆయన, తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఎంబీసీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.