అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు సురక్షితం



రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం కామారెడ్డి నుండి రామారెడ్డి వెళ్లే రహదారిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే గంగమ్మ వాగు ప్రాంతంలో మద్దికుంట గ్రామం నుండి కామారెడ్డి వెళ్తున్న ఆర్ అండ్ బి రోడ్డు పై నుండి ఆర్టీసీ బస్సు అదుపుతప్పడం జరిగింది. డ్రైవర్ యొక్క చాకచక్యంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రమాదం ఏమి జరగలేదు. బస్సులో మొత్తం 108 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 12 మంది మగవాళ్ళు మిగతా ఆడవాళ్లు ఉన్నారు. ఇదే క్రమంలో మండల కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఈ యొక్క ప్రమాదాన్ని అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఫోన్ చేసి మరొక బస్సును తెప్పించి ప్రయాణికులను సురక్షితంగా పంపించగలిగారు. ఈ యొక్క ఘటన విషయంలో స్థానిక ఎస్సై నరేష్ తక్షణమే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని సహాయ సహకారాలు అందించారు.