ప్రభుత్వ ఆసుపత్రి, దానిని ఏలే వారి విధి విధానం
– ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సూపర్ండెంట్ ఎవరు…?
– గత 5 సంవత్సరలుగా ఒకటే నంబర్…….
– ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది మాత్రం……….ఆ మెగాస్టారే ……ఇంతకు ఆ మెగాస్టార్ ఎవరు…
– ప్రభుత్వ ఉద్యోగస్తుడా..? లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగా….? లేక..వేరేశాఖకు చెందిన వాడా…?
– సూపరెండేంట్ నంబర్ ఇతని దగ్గర ఎలా…?

నిజామాబాద్ , జులై 29 (లోకంతీరు) : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏమి జరుగుతుందో ఎవరికి అర్థము కావడం లేదు..ఆసుపత్రిలో రెగులర్ ఉద్యోగులు ఎంత మంది పని చేస్తున్నారు. ..? అవుట్ సోర్సింగ్ క్రింద ఎంత మంది పని చేస్తున్నారు..? ఆసుపత్రిలో మొత్తం అన్ని విభాగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు..? వీరికి బాస్..మేడమా లేక ..ఆ మెగాస్టారా అర్థము కావడం లేదు. ఈ ప్రభుత్వాసుపత్రిలో అన్ని ఆయననే చూసుకుంటాడు. కరోన సమయంలో కూడా ఫోన్ చేస్తే ” మేడమ్ బిజీగా ఉన్నారు తర్వాత ఫోన్ చేయండి అని సమాధానం ఇచ్చేవాడు” విషయం ఏమిటంటే సూపరెండేంట్ నంబర్ ఇతనికి ఎవరు కేటాయించారు..ప్రస్తుతం కూడా అదే నంబర్ ఎలా కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడానికి సెల్ఫోన్ సౌకర్యం కల్పించింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మాత్రం సూపర్ ఇండెంట్ కు కేటాయించిన నంబరు ఎవరు రిసీవ్ చేసేది…ఎవరు మీరు ఎవరూ అని అడిగితే నేను మేడం పిఏ ని , మీకేం పని కావాలి అని ఎదురు సమాధానం ఇస్తూ ఉంటాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి మేడం గారికి చెబుతాను అంటాడు. కానీ ఇతను ఎవరు మేడం పీఏనా.. ప్రభుత్వ సూపరిమెంట్ పర్ పర్సనల్ అసిస్టెంట్ టా లేక ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ ఉద్యోగా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కానీ అన్ని తానై చూసుకుంటాడు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సేవా అవార్డులు కూడా తీసుకున్నాడు అంటే ఇతను ఎంత గొప్ప మహానటుడు మెగాస్టార్ అయి ఉండవచ్చు అని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇతనికి ఆసుపత్రికి ఎటువంటి సంబంధాలు లేకపోయినా ఉత్తమ ప్రశంస పత్రాలు ఏ క్యాడర్ క్రింద కేటాయించారో.. అటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు అంతుచిక్కని సమాధానం గా మారింది. ఈ మెగాస్టార్ అన్ని తనై చాలా చాకచక్యంగా ఉంటూ అన్నిటినీ మూట కట్టుకుంటాడు ఇంతకీ ఇతను ఎవరు. ఇతని వృత్తి ఏమిటి…..?