డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం
– జిల్లా కేంద్రంలో న్యాయవాదులు, డాక్టర్స్ ల కొవ్వొత్తులతో ర్యాలీ

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 21( లోకంతీరు ) : కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, అలాగే డాక్టర్లు చేస్తున్న నిరసనలకు సంగీభావంగా న్యాయవాదులు కామారెడ్డి పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు మంగళవారం రాత్రి క్యాండిల్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోలా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కలకత్తాలో మహిళ డాక్టర్ పై జరిగిన సంఘటన చాలా హెయమైన చర్య అని అట్టి సంఘటనను బార్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక ముందు డాక్టర్ లు తీసుకునే నిరసన కార్యక్రమానికి ఎల్లప్పుడూ సహాయ, సహకారలు అందిస్తామని, వాళ్లు తీసుకునే నిరసన కార్యక్రమానికి మద్దతు ఉంటుందని, హత్యాచార దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోలా శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు చింతల గోపి, సంయుక్త కార్యదర్శి మోహన్ రెడ్డి, అమృత రావ్, శంకర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సిద్దరాములు, దామోదర్ రెడ్డి, శ్యామ్ గోపాల్ రావ్, జయప్రకాశ్, ఇతర న్యాయవాదుల తో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణ, కార్యదర్శి అరవింద్ గౌడ్, జిల్లాలోని డాక్టర్స్ పాల్గొన్నారు.