పట్టణంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలన
– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షంలో మునిగిన లోతట్టు ప్రాంతలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియ మంగళవారం సందర్శించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డి నియోజక వర్గంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం, కామారెడ్డి పట్టణంలో వివిధ కాలనీలో ఇండ్లు నీట మునగడం, ఇళ్లలోకి నీళ్లు రావడం, రోడ్లన్నీ కొట్టుకపోవడం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.దీంతో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ నిరుపేదలై, అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ, వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపారు.అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు.సమీక్షలో అధికారులకు ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం, వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్ష సూచనతో ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్ల కు, ఎన్డీఆర్ఎఫ్ తరహా లో సేవలు అందించారు.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెల కు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేశారు.వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక తక్షణమే కేంద్ర సాయం కోరుతు మరియు జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు రాష్ట్ర ప్రభుత్వం నుండి లేఖ రాయడం జరిగిందన్నారు.ఎవరు కూడా ఆ ధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా ఉంచి, ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రతిపక్షాలు రాజకీయ చేయడం మాని ప్రజలకు మంచి చేసే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ వారికి అండగా ఉంటూ సహాయపడుతూ ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.