Take a fresh look at your lifestyle.

హాజీపూర్ తండా పంట పొలాల్లో చిరుత సంచారం ….

0 1,603

హాజీపూర్ తండా పంట పొలాల్లో చిరుత సంచారం 

– తండావాసులు ఆందోళన 

 – పంట పొలాల్లో చిరుత పాదముద్రలు లభ్యం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 06 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా శివారులోని పంట పొలాలలో చిరుత సంచారం చేస్తున్నట్లు శుక్రవారం ఆనవాళ్లు కనిపించాయని తాండా వాసులు తెలిపారు . ఇటీవలే మండలంలోని హాజీపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింది తండాలో విద్యుత్ కంచెకు తగిలి చిరుత పులి మృత్యువాత పడిన సంఘటనను తాండవసులు భయాందోళనకు గురై గుట్టు చప్పుడు కాకుండా దాని పూడ్చి పెట్టి, అటవీ అధికారులచే తీయించిన విషయం పాఠకులకు విదితమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తాండవసులు చిరుత సంచారం విషయాన్ని ఎవరికి చెప్పాలో అని సందేహిస్తున్నారు. చిరుత పులి తండాలోని పశువులపై, మనషులపై దాడి చేయకుండా ముందస్తుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నా తాండవాసులు భయాందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈవిషయమై తండవాసులు, రైతులు విలేకరులకు సమాచారం అందించగా, పంట పొలాల వద్దకు వెళ్లి చిరుత పులి పాదముద్రలు చూసి, నిజంగానే చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. తాండవాసులు విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవలే మృత్యువాతకు గురైన ఆడపులి, కోసమే మగపులి సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పులి గత మూడు నాలుగు రోజుల క్రితం పంట పొలాల వైపు సంచరిస్తున్నట్లు తాండవాసులు గమనించినట్లు సమాచారం. పాద ముద్రలను బట్టి పులి సంచారం జరుగుతున్నట్లు నిర్ధారణ అయిందని, ఏలాంటి ప్రాణనష్టం జరగకంటే ముందు అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించడానికి బోనును ఏర్పాటు చేయాలని తాండవాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.