వివాహిత మహిళా అదృశ్యం

ఎల్లారెడ్డి, ఆగస్టు 29( లోకంతీరు ) : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాకు చెందిన ధనావత్ మంజుల తల్లిగారి ఇంటికి రాఖీకట్టడానికి వెళ్తాను అని ఇంట్లో చెప్పి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.మూడు సంవత్సర క్రితం భర్త చనిపోయారు.దింతో ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని,మంజుల కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.మంజుల బావ శ్రీను ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుఎస్సై మహేష్ తెలిపారు.