విశ్వ కర్మ రాష్ట్ర కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు ( లోకంతీరు ) : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ విశ్వకర్మ సెల్ సమావేశం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని శనివారం నియమించారు. ఇందులో భాగంగా ఓబీసీ మోర్చా విశ్వకర్మ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గా తిప్పర్తి సతీష్ ఆచారిని నియమించారు. ఈ సందర్బంగా నియమకపత్రాన్ని రాష్ట్ర కన్వీనర్ పూసల బ్రహ్మచారి, కో కన్వీనర్లు కొంపోజు గోవర్ధన్ చారి, రాష్ట్ర యువజన కన్వీనర్ శ్రీపాద నరేష్ చారి, చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చిన పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి, ఎంపీ బండి సంజయ్ కి, ఎంఎల్ఏ కాటిపల్లి వెంకట రమణారెడ్డి కి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార కు కృతజ్ఞతలు తెలిపారు.