Take a fresh look at your lifestyle.

కెజిబివి పాఠశాలకు అదనపు గదులకు శంఖుస్థాపన…..

0 1,360

కెజిబివి పాఠశాలకు అదనపు గదులకు శంఖుస్థాపన

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ శనివారం శంఖుస్థాపన చేశారు.3.25 కోట్ల తో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నియోజ కవర్గం లో విద్యార్థులకు ప్రతి పాఠశాలలో అన్నీ మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నియోజక వర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తుందని, దానికి కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. విద్యార్థులకు విద్యా, క్రీడా రంగాలలో తగిన ప్రోత్సహన్ని ఇస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.