భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– మాజీ మంత్రి,బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నిండిన ఉత్తర తెలంగాణ వరప్రదయిని శ్రీ రాం సాగర్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సూదర్శన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు.ఈ సందర్భంగా సూదర్శన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరోజుల్లో లక్షల ఏకరలకు నీరు అందించే విదంగా ఆనాటి ప్రధాని నెహ్రు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసారని అన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండి కలకల లడుతుందని,ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని,రైతులకు ఖరీఫ్ సీజన్ పూర్తియే వరకు నీరు అందించే విదంగా ప్రణాళికలు తయారు చేసి నీరు అందిస్తామని తెలిపారు.అదేవిధంగా వర్షాలు పడితే మొదటగా వచ్చేది విద్యుత్ సమస్య కావున అలాంటి సమస్య రాకుండా ఇంజనీర్లు వ్యవసాయం కోసం వదిలే నీతితో 25 పర్సెంట్ విద్యుత్తు తయారు చేసే విధంగా రూపొందించారని, విద్యుత్తు తయారు చేసేటప్పుడు పొల్యూషన్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినఅధికారులనుఅభినందించారు.అంతేకాకుండా వర్షాలతో అక్కడక్కడ ఇళ్లు కోల్పోయిన వారు అధైర్య పడవద్దని వారికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటుందని ఆయన అన్నారు.పంట నష్టం జరిగిన రైతులకు అధికారులతో పర్యవేక్షించి నష్టపరిహారం అందిస్తామని ఎవరు అధైర్య పడవద్దని సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహిర్ బిన్ హందం,రాష్ట్ర వితనాభివృది చైర్మన్ అన్వేష్ రెడ్డి,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,నాగేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ అరికేలా నర్సారెడ్డి,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి,బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,మెందొర మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి,వేల్పూరు మండల అధ్యక్షులు నర్సారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.