మండల కేంద్రంలో అవగాహన సదస్సు
కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం రైతు వేదిక భవనంలో ఆర్.టి.ఐ అవగాహన సదస్సు బుదవారం నిర్వహించారు. మండలంలోని రైతు వేదిక మహిళ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో రాజంపేట మహిళా మండల సమైక్య మహిళ అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సాయిలు, మరియు కామారెడ్డి డిపిఎం సుధాకర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం పాల్గొని ఈ సందర్భంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన చట్టాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ జమున సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి పట్టణ కార్యదర్శి ఆర్ టి ఐ 2005 గురించి మహిళలకు తెలియజేశారు. సమాచార హక్కు చట్టం 2005 అనేది ఒక వజ్రాయుధం లాంటిదని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, కార్యదర్శి చేపూరి లత, కోశాధికారి లావణ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శిలు పాల్గొన్నారు. అలాగే సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ప్రతినిధులు టి నరసింహ చారి న్యాయవాది, సాహేరా బేగం, ఇర్ఫాన్, రాజంపేట మండల అధ్యక్షులు రామచందర్, డాక్టర్ తహర్ హుస్సేన్ తదితరులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.