Take a fresh look at your lifestyle.

జన్కoపల్లి కుర్దు తండాలో ఘనంగా శ్రావణమాస ఉపాస దీక్షలు….

0 1,242

జన్కoపల్లి కుర్దు తండాలో ఘనంగా శ్రావణమాస ఉపాస దీక్షలు 

ఎల్లారెడ్డి,  సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : మండలంలోని లక్షాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జనకంపల్లి కుర్దు తండా, హాజీపూర్ తండాలలో మంగళవారం గిరిజన మహిళలు శ్రావణమాస ఉపాస దీక్ష చేపట్టారు. గిరిజన మహిళలు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఐదు మంగళవారాల ఉపవాస దీక్షలు చేపట్టి చివరి ఐదోవ మంగళవారమైన మహిళలు ఇంటి వద్ద నైవిద్యం చేసి తండలో నిర్మించిన జగదంబ మాత, సేవాలాల్ మహారాజ్, ఆలయం వద్ద చేరుకొని ఐదుసార్లు ప్రదక్షిణలు చేసి జగదంబ మాత,సేవాలాల్ మహారాజ్ భోగ్ బండార్ నిర్వహించి నైవేద్యం సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు.అనంతరం గిరిజన మహిళాలు చిన్నారులు ఆలయం వద్ద సంప్రదాయ నృత్యలు చేసి ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.