రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి నియోజక వర్గం అభివృద్ధి కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కావాలని తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నందు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్కను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం చాలా వెనుకబడిన నియోజక వర్గం అని ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం అంగన్వాడీ నిధులు మంజూరు, నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం, మరమత్తులు, తండా గ్రామల రోడ్లు, వంతెనలు నిర్మాణం కొరకు 244 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారు.