మూడో కళ్ళు సొసైటీ అక్రమలపై బహిరంగ చర్చకు సిద్ధమా !
– స్వామి గౌడే స్థానికేతరుడు ..
2022 వరకు భీంగల్ మండలం లో ఉపాధి హామీ కార్డు …
– కార్మికులకు నెలకు 4000 వేతనం
ఆ ముగ్గురికి 2లక్షల వేతనం
– సబ్యులకు అయిదు నెలలు అయిన అందని వేతనం
– సొసైటీ నుండే కారు డ్రైవర్లకు వేతనమా?
– ఆధార్ లతో సహా నిరూపణ చేసిన గౌడ సంఘం నాయకులు
– పోరాడిన వారికి కాకుండా కుటుంబ సభ్యులకు కార్మికులుగా అవకాశం


నిజామాబాద్, ఆగస్టు 25 (లోకంతీరు): నిజామాబాద్ నగరంలోని భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘం సొసైటీలో జరిగిన జరుగుతున్న అక్రమాలపై బహిరంగంగా చర్చించడాని సిద్ధమేనా అని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు .ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూడవ కళ్ళు సొసైటీకి చెందిన గౌడ కులస్తులతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మూడవ కళ్ళు సొసైటీలో గీతా కార్మికుల పొట్టను కొట్టి సంఘం బై లాను తుంగలకు తొక్కేసి స్వామి గౌడ్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగిందని, హైదరాబాదులో నాలుగు కోట్ల రూపాయల విల్లాను నిజామాబాద్ లో కోటి రూపాయలతో ఇల్లును మూడు కార్లను కొనుగోలు చేశారని డిపో యజమానులుగా చలామణి అవుతున్న మరో ఇద్దరు వ్యక్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు మాత్రాము నెలకు తల 2 లక్షల వేతనం తీసుకుంటు,కార్మికులకు కేవలం 4000 రూ, సబ్యులకు నెలకు 1000 ఇస్తూన్నారని, ఐదు నెలల నుండి సబ్యులకు ఆ వేయి రూపాయలు కూడా ఇవ్వడం లేదని అన్నారు
సొసైటీ బైలా ప్రకారం వచ్చిన లాభాలను 15% వాటాను కార్మికులకు పంచాలి , 25% లాభాలను గీతా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలి , సొసైటీ పేరు మీద ఆస్తులు కూడా కట్టాలి కానీ సొసైటీ పేరు మీద ఒక్క గజం భూమి కూడా ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా చేసి వచ్చిన లాభాలు అంతా కూడా ఈ ముగ్గురే పంచుకోవడం జరిగిందని అన్నారు. నగరంలోని మొదటి రెండవ సొసైటీలో సభ్యత్వం లేని గౌడ కులస్తులను గీత కార్మికుల కోసం గత ప్రభుత్వం మూడవ కళ్ళు సొసైటీకి అనుమతులు ఇవ్వడం జరిగింది అని అనుమతులు వచ్చిన తర్వాత సొసైటీ కోసం పోరాడిన వ్యక్తులకు కాకుండా స్థానికేతరులైన స్వామిగౌడ్ తన బంధు బలగంతోటి నింపడం జరిగిందని వారికి సంబంధించిన ఆధారాలను మీడియా సమక్షంలో చూపించడం జరిగింది. ఈ ఆధారాలు తప్పయితే బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమేనని నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే ముక్కునేలకు రాస్తానని అన్నారు, వేరే జిల్లా వారికి ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు ఉపాధి హామీ కార్డులు పెన్షన్ కార్డులు కలిగిన వ్యక్తుల వివరాలను అన్ని కూడా మీడియా సమక్షంలో ప్రదర్శిస్తున్నామని చూపెట్టడం జరిగింది ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఎక్సైజ్ కోపరేటివ్ ఇన్స్పెక్టర్ రాహుల్ విచారణని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మేము ఫిర్యాదు చేసిన పత్రాలు అన్ని అందజేసిన కూడా ఆధారాలు ఇంకా ఇవ్వాలి మాకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు ,ఇంత జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లువ్యవహరిస్తున్నారని మామూళ్ల మత్తులో కూడుకపోయి ఉన్నారని వారి పైన కూడా రాష్ట్రస్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని స్థానికులకు గీతా కార్మికులుగా అవకాశం కల్పించాలని సొసైటీలో స్థిర నివాసం ఉన్నటువంటి గౌడ కులస్తులకు సభ్యత్వం కల్పించాలని అంతవరకూ పోరాటం ఇదేవిధంగా కొనసాగుతుందని అన్నారు. నెల రోజులుగా అక్రమ ఆధార్ కార్డులపై జిల్లా కలెక్టర్ కు, పోలీస్ కమిషనర్ కు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు విచారణ మాత్రం ముందుకు సాగడం లేదని, ఈ అక్రమ ఆధార్ కార్డుల మార్ఫింగ్ పై కేంద్ర హోంశాఖకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా సొసైటీ లాభాలపై చేస్తున్న ఆడిట్ రిపోర్టర్ సైతం, బయటపెట్టనున్నామని అన్నారు,చీఫ్ ప్రమోటర్ అక్రమ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేస్తామన్నారు . తక్షణమే నూతన కార్మికులకు తీసుకోవాలని, కుల బహిష్కరణ చేసిన రాజగోపాల్ గౌడ్ ను ఆయన కల్లు దుకాణం ఆయనకు ఇచ్చి కులం లోకి తీసుకోవాలని సిరిగాధ స్వామి గౌడ్ కులం లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాజగోపాల్ గౌడ్ సిరిగాథ స్వామి గౌడ్ ,బాబా గౌడ్ అశోక్ రాజ్ గౌడ్ , అఖిల్ గౌడ్ రాజ్ కుమార్ గౌడ్ సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.