లోకం తీరు ప్రత్యేక కథనం
ఖాళీ స్థలం కనిపించిందా కబ్జా చేసేయ్…?
-
ఆ సర్వే నంబర్ల పరిస్థితి ఏమిటి
-
అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమి
-
పట్టించుకునే నాధుడే లేడని ఇదేచ్ఛగా ఆక్రమణ
-
వాస్తవానికి స్థల విస్తీర్ణం ఎంత..?
-
ప్రభుత్వ కేటాయింపులో భూమి వివరాలు పదిలమేనా
-
అంతా నేనే చూసుకుంటా మీరు నిమిత్తమాత్రులు..!
-
పట్టించుకునే నాధుడే లేడు
-
నిరుపేద లబ్ధిదారుల కల నెరవేరేనా..?

రామారెడ్డి , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : స్వతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాల పైబడిన ఇప్పటివరకు కొందరికి ఇల్లు లేక భూములు లేక నానా ఆవస్తలు పడుతున్న విషయం విధితమే, కానీ పేదల కోసం వారి ఆర్థిక స్వాలంబన కొరకు అభివృద్ధి బాటలు నడిచేందుకు, పేదలకు ఇల్లు కట్టుకుననే స్తోమత లేకుండా ఉన్న ఈ రోజుల్లో ప్రభుత్వ భూమి కూడా కాజేస్తున్న వైనం..? రామారెడ్డి మండల కేంద్రంలోని ఆ..! ప్రభుత్వ సర్వే నంబర్ లో గతంలో చాలా రోజుల క్రితం 1987 వ సంవత్సరంలో ఆ యొక్క సర్వే నంబర్లు లో సుమారు 60 ప్లాట్ లను కేటాయించారు. ఒక్కో ప్లాటు వాటి విస్తీర్ణం మూడు సెంట్లు (142 గజాలు) గా కేటాయించడం జరిగింది. అప్పటి సదాశివనగర్ మండలం తాలూకా కామారెడ్డి అప్పటి పరిస్థితుల్లో ఉన్న తహసిల్దార్ టి సుబ్బారావు జారీ చేసిన పత్రాలు లబ్ధిదారుల చేతిలో చిత్తు కాగితాలతో సమానంగా మిగిలిపోయాయి. చేసేది ఏం లేక బిక్కు బిక్కు అంటున్న లబ్ధిదారులను దళారులు,ఏం చేసుకుంటారో చేసుకోండి అవి మాకు చెందిన భూమి, మాకు ఎలాంటి నియమ నిబండలు ఏమి అవసరం లేదు. ఇది మా జాగా ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..? అంటూ కొందరు దళారులు, వారికి తోడు వత్తాసు పలుకుతూ స్థానిక కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం విడ్డూరం. ఈ యొక్క భూమిని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాలుగా స్థలం లేని లబ్ధిదారుల కొరకు వారికి స్థలానికి కేటాయించారు. అప్పట్లో అందరికీ సరిపోయేంత భూమి లేక పోతే ఆర్ సాయిన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు విలేజ్ తరఫున కొందరి భూములను గ్రామ పంచాయతీ తరపున కొనుగోలు చేసి ఆ యొక్క భూములను గ్రామపంచాయతీకి అటాచ్ చేసి అందులో కొందరికి భూ పంపిణీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో కొందరు సంచార జీవనం గడపడానికి, కొందరు తాత్కాలిక ఇండ్ల ను నిర్మించుకున్న మాట విధితమే..! కాళీ ప్రస్తుతం ఇప్పుడు భూముల విలువ పెరుగుతుంది కాబట్టి ముందస్తుగా కాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడమే పరిపాటిగా మారింది. ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అడిగే వారు లేఖన చూసిన అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామపంచాయతీ పాలకవర్గం క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు చెందాల్సిన స్థలం ఎంత, ఆక్రమణకు గురైనది స్థలం ఎంత ఉండాలి అనే వివరాలతో పొందుపరిచిన గ్రామకంఠం సరిగా లేకపోవడమే కారణమా ఇలా ఎందుకు చేశారు. ఎందుకు చేస్తున్నారు. ఎవరి లబ్ధి కొరకు, కాసులు ఇస్తే చాలు “స్వయంగా కాశీని” కూడా అమ్మేసే రోజులు ఈ యొక్క బకాసురులు అనే సందేహం లేదు..? తదుపరి 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఇదే స్థలముకి సంబంధించి మరో 50 ఇళ్ల మంజూరును ఇందిరమ్మ పథకం కింద ఒక్కొక్కరికి 70 గజాల చొప్పున లబ్ధిదారులకు పట్టాలను అందించిన ఘనత. కానీ ఇప్పుడు లబ్ధిదారులకు చెన్నాదాల్సిన భూమి కొందరి చేతుల్లో కీలుబొమ్మల మారింది. ఇట్టి విషయంపై ఎవరిని అడిగినా స్పందన లేదు. ఇక నైనా అధికార యంత్రంగా స్పందించి ఈ యొక్క సర్వే నెంబర్ పై విచారణ చేసి అసలు ప్రభుత్వ భూమి ఎంత, లబ్ధిదారులు ఎందరు, వారు నిజమైన లబ్ధిదారుల కాదా..! ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ భూమిని ఎవరైనా అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు అని ప్రభుత్వమే ఓవైపు చెప్తున్నా మాకెందుకులే మా పని మేము చేసుకుంటాం మాకు అందరు తెలుసు మీరేం చేసుకుంటారో చేసుకోండి. అనే తారస్థాయికి భూ బకాసురులు రోజురోజుకు చిరారేగిపోతున్నారు. ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి ఆ యొక్క సర్వే నంబర్లు విస్తీర్ణం ఎంత ఎక్కడ వరకు కేటాయించారు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారికి న్యాయం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే చొరవతో అక్రమార్కుల వ్యూహం పై స్పందించి అధికార యంత్రాంగాన్ని ప్రేరేపించి లబ్ధిదారులకు సరైన న్యాయం చేయగలరని మేధావి వర్గం భావిస్తోంది.
( తరువాయి భాగం రేపటి సంచికలో )