Take a fresh look at your lifestyle.

కొత్తగూడెంలో చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం. 

0 12

చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం.   

విషాదం నింపిన రోడ్డు ప్రమాదం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ములకలపల్లి మండలంలోని మాదారం–పూసుగూడెం గ్రామాల మధ్య ఆదివారం కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో సంధ్య, ఆమె కుమారుడు, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికుమార్ తల్లి జ్యోతి తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు భద్రాచలం పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు వారిని పరామర్శించి తిరిగి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, భద్రాచలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.