ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవాలి.
-
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని రామకృష్ణ అడుగు జాడలలో నడవాలని మాజీ విద్యా శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ.దేశం గర్వించదగిన వ్యక్తిగా ఎదగాలని 10వ తరగతి విద్యార్థులకు ఆయన సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనకు ఘనంగా సన్మానించారు.ఆయన వెంట దొప్పల పూడి శ్రీధర్,కొల్లూరు కిషోర్ బాబు,కొల్లూరు రమే ష్,మల్లేపల్లి శ్రీనివాస్,ఉదయ్, సాయి శ్రీనివాస్,జానకిరామ్, హనుమంతరావు, తదితరులు ఉన్నారు.