భారాస నాయకుల అలయ్ బలయ్
రామారెడ్డి , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : రామారెడ్డి ఉమ్మడి మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా భారాసా నాయకులు కార్యకర్తలు సోమవారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ ఉద్యమకారులైన నాయకులు విజయదశమికి వారి వారి స్వగ్రామాల్లో ఉండడంతో సోమవారం కామారెడ్డి చేరుకొని అందరూ కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యమంలో కొనసాగిన పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఇక కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భారాసా సీనియర్ నాయకుడు మండల రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, గాంధారి మండల భారాస మండల అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు, కాలభైరవ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్ గుప్తా, జిల్లా బీసీ నాయకుడు సాయగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, రామారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, భారాస నాయకులు పోతుల లింగారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లింబాద్రి నాయక్,గొల్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.