ఇంటింటి సర్వే పగడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి జిల్లా ,నవంబర్ 01 ( లోకంతీరు ) : ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజు పట్టణంలోని వాసవీ హై స్కూల్ సమీపంలోని వార్డులో జరుగుతున్న ఇంటింటి సర్వే ను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రతీ ఇంటిలో నిర్వహించాలని, కుటుంబంలోని ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఆ ఇంటిలోని సమాచారాన్ని సేకరించిన అనంతరం స్టిక్కర్ అంటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియా, ఇతర అధికారులు పాల్గొన్నారు.