Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు హెచ్ ఐ వి, ఎయిడ్స్ పై అవగాహన….

0 1,119

విద్యార్థులకు హెచ్ ఐ వి, ఎయిడ్స్ పై అవగాహన

– అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి జిల్లా , నవంబర్ 02 ( లోకంతీరు ) : విద్యార్థులు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోవాలని
అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ లో భాగంగా పాఠశాల విద్యార్థులకు, మరియు కళాశాల విద్యార్థులకు హెచ్ ఐ వి, టి బి, రక్తదానం పై జిల్లా స్థాయి రెడ్ రన్, క్విజ్ పోటీలు డ్రామా మరియు రీల్స్ పోటీలను శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి విభాగం నుండి మొదటి బహుమతి 1000 రూపాయలు,ద్వితీయ స్థానం 750 రూపాయలు, తృతీయ స్థానం 500 రూ. లు ను అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేసారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డా. రాధిక, డిపిఎం సుధాకర్, డి ఏ ఏ మహేష్, సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ అంజయ్య, విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎస్ ఆర్ కే డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.