Take a fresh look at your lifestyle.

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే….

0 1,127

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే

— ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 02 ( లోకంతీరు ) : అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని కుప్రియాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు మదన్మోహన్ రావు విచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతుల సమస్యల పై సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానికంగా గోడౌన్ అత్యవసరమైన సందర్భంగా ఎమ్మెల్యే కావలసినటువంటి భూమిని సీసీఎల్ లో మాట్లాడి ఇప్పిస్తానని తెలియజేయడమైనది. గ్రామానికి రోడ్డు విస్తరణ కూడా చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తిని ఎమ్మెల్యే చేయిస్తానని మాట ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి, సీనియర్ నాయకులు ఇర్షాద్ ఉద్దీన్, లింగాగౌడ్, లడ్డు శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్ రెడ్డి ,సంకరి రాజలింగం,లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు భాస్కర్,భత్తుల రాములు, కృష్ణారెడ్డి, లక్ష్మా గౌడ్, గ్రామస్తులు కృష్ణారెడ్డి వెంకట్రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.